Suresh Pillai

Category: JOURNALIST

  • చూపున్న కర్ర!

    చూపున్న కర్ర!

    నేను అంధుడినని ప్రపంచానికి చాటింపు వేస్తూ.. ‘వైట్ కేన్’ లాగా నిన్ను చెంత ఉంచుకునే కదా..  ఇన్నాళ్లూ ప్రతి అడుగూ వేశాను! కుదిరినంత ప్రపంచం తిరిగాను!!   నా దారి  కంటకావృతమో.. గోతుల మయమో.. దుర్గమమో.. దుస్సహమో..  విషసర్ప భూషితమో.. కించిత్ సాహసోపేతమో.. నువ్వందించే హెచ్చరికలను బట్టే కదా.. నువ్వు సంకేతించే జాగరూకతలను అనుసరించే కదా..  నేను ప్రతిసారీ, ప్రతి ప్రస్థానంలోనూ.. మనగలుగుతూ, నెగ్గుతూ వచ్చాను!   నువ్వు నా వైట్ కేన్ వి! నా చూపువి.…

  • పగటి వేషగాడు (కవిత)

    పగటి వేషగాడు (కవిత)

    నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద చీముగడ్డలా వివర్ణుడైన సూర్యుడు! తెల్లారుతుంది. అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు.. గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు! పలకరింపు ఒక కత్తి తునక.. ‘ఇలా ఎలా?’ ప్రతిసారీ ఒక పృచ్ఛ శలాక పొడుచుకుంటుంది..! జన్మాంతానికీ మానని గాయాన్ని కెలుకుతుంటుంది.. వేదన ప్రచ్ఛన్నంగా గుండె తెరచుకుంటుంది.. మీట నొక్కినట్టుగా.. నాలుగు మాటలు అప్పజెప్పేస్తాను! అశ్రురహిత భావరహిత ప్రేలాపనలాగా! ఏ పాతాళంలోకీ కూరుకుపోలేని అశక్తత.. ఆప్తులు వొస్తారు.. నన్ను ముంచి…

  • గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత

    గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత

    హైదరాబాదు మణికొండలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం (కార్యక్రమం ఏర్పాటుచేసిన ప్రభోదిత స్వచ్ఛంద సంస్థ సారథి శ్రీమతి జయభారతి గారికి, ప్రధానోపాధ్యాయులు నాగార్జున గారికి కృతజ్ఞతలు) గ్రంథాలయాలు అంటే  మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని పుస్తకాలను ఒక చోట చేరిస్తే దాన్ని లైబ్రరీ అంటాం. గ్రంథాలయం అంటే గ్రంథాలన్నీ ఉండే ఒక ప్రదేశం. కాబట్టి, గ్రంథాలయాల గురించి చెప్పడానికంటె ముందు.. పుస్తకం గురించి చెప్పాలి. పుస్తకాన్ని మనం కొద్దిగా బరువైన భాషలో గ్రంథం…

  • న వినుతి.. నా వినతి.. (ముందుమాట)

    న వినుతి.. నా వినతి.. (ముందుమాట)

    కూర్చుని తింటూ ఉంటే.. తన తర్వాతి తరాలు గూడా నిమ్మళంగా రోజులు గడిపేయడానికి వెసులుబాటు కల్పించగల ఒక ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని… యిచ్ఛాపూర్వకంగా పాత్రికేయ వ్రతంలోకి ప్రవేశించినవాడు ఎల్లయ్య.  మదరాసులో- పెద్దదిక్కు అయిన మిత్రుడి పత్రికా ప్రెస్సులో ఉద్యోగం, వేర్వేరు పత్రికల స్థాపనలు, మూసివేతలు తర్వాత 1970లో ఆయన స్థాపించిన వారపత్రిక ‘ఆదర్శిని’. రెండున్నరేళ్ల తర్వాత.. ఎల్లయ్య- భారతమ్మ దంపతులకు పుట్టిన ఒకే ఒక్క కొడుకు నేను. ఆ రకంగా తల్లిదండ్రుల ద్వారా నాకున్న ఏకైక తోబుట్టువు ‘ఆదర్శిని’.…

  • తెల్లబజారులో వెంకన్న విక్రయం.. మొదటికే మోసం!

    తెల్లబజారులో వెంకన్న విక్రయం.. మొదటికే మోసం!

    ఒక వ్యవస్థలో కొత్త పాలకులు వచ్చినప్పుడు.. తమ ముద్ర కోసం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఆయా నిర్ణయాలకు ఎదురయ్యే ఫలితాలను బట్టి.. లోటుపాట్లు గుర్తించేకొద్దీ వాటిని దిద్దుకుంటారు. కొన్ని సార్లు చిత్రమైన పరిస్థితి ఉంటుంది. లోపాలు బయటపడే సరికి.. దిద్దలేని దుస్థితి ఏర్పడి ఉంటుంది. కొత్త విధానాలను కార్యరూపంలో పెట్టేప్పుడు, సుదూర పరిణామాలను అంచనావేయడంలో తేడాల వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో, పరిణామాల గురించిన కొన్ని భయాలు కలిగినప్పుడు.. వాటిపై చర్చ…

  • అమ్మలూ.. బాబులూ… కళ్లు తెరవాలి!

    అమ్మలూ.. బాబులూ… కళ్లు తెరవాలి!

    జీవితం అంటే ఏమిటి? భార్య-భర్త కలిసి బతకడం. మహా అయితే పిల్లలు. తమ బాధానందాలన్నింటినీ కలసి పంచుకోవడం మాత్రమేనా జీవితం అంటే! జీవితం అనే వ్యవహారంలోకి మరెవ్వరి ప్రమేయమూ ఉండదా? కేవలం దంపతులు మాత్రమే అనుభవించేది జీవితం కాబోదని, తమ పిల్లలతో కలిసి పంచుకోవాల్సిందేనని చెప్పే స్పృహ అందరికీ ఉంటోంది. కానీ, తాము పిల్లలతో పంచుకునేదే జీవితం అనుకుంటూ… తాము పిల్లలుగా తమతో జీవితాన్ని పంచుకున్న పెద్దలను… తమ జీవితానికి బయటి వ్యక్తులుగా చూడడం అనేది ఎలాంటి…

  • సర్వోన్నత తీర్పు అపరిపక్వమా?

    సర్వోన్నత తీర్పు అపరిపక్వమా?

    ‘మరొక వ్యక్తి భార్యతో శృంగార సంబంధం కలిగి ఉంటే తప్పా కాదా?’ ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తప్పొప్పులు అనేవి అభిప్రాయాలు! వీటికి ‘సామాజిక’ అనే పదం జోడించింది సర్వోన్నత న్యాయస్థానం. ఎటొచ్చీ ఇవి అభిప్రాయాలు మాత్రమే… ‘సామాజిక’మైనవి మాత్రమే గనుక.. సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత- ఇది తప్పు కాదు అనే వాళ్లూ మనలో ఉంటారు. అలాగే ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తప్పే’ అనే వాళ్లు, తొలినుంచీ ఉండనే ఉన్నారు. ‘తప్పు’ గోల…

  • ఆఫ్గన్ విలువ ఆంధ్రప్రదేశ్ కు లేదా?

    ఆఫ్గన్ విలువ ఆంధ్రప్రదేశ్ కు లేదా?

    తాజాగా ట్రంప్ మనకు ఒక మేలు చేశారు.  ఇరుగు పొరుగు దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్ని ఎగతాళి చేశారు. దేశవ్యాప్తంగా రాద్ధాంతం రేగింది. అంతర్జాతీయ యవనికపై ఈ ఎగతాళి మాటల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ దురహంకార స్వరాన్ని తిప్పికొట్టడానికి కేంద్రప్రభుత్వం తగురీతిలో స్పందిస్తోంది. అయితే… రెండో పార్శ్వం నుంచి చూసినప్పుడు… ఈ ఎగతాళి మాటల ద్వారా.. ట్రంప్ మనకు ఒక మేలు చేశారని తెలుస్తుంది. ఆర్తిలో ఉన్న వారికి మనదేశం ఎంత సాయం చేస్తున్నదో, యావత్…