Description
కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన కథా సంపుటి గారడీవాడు కు 2023 లో ఉత్తమ కథాసాహిత్యంగా రెండు అవార్డులు లభించాయి.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరులోని శివేగారి దేవమ్మ ఫౌండేషన్ వారి కథాపురస్కారం -2023
2. తెలంగాణ రాష్ట్రం వేములవాడలోని ఈశ్వరగారి ముక్తేశ్వరి దేవి ఫౌండేషన్ వారి కథాపురస్కారం -2023
♥ సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన మూడో కథా సంపుటి ‘గారడీవాడు’
♥ ఇందులో మొత్తం 15 కథలు ఉన్నాయి. 14 ప్రచురితమైన కథలతో పాటు, సంపుటిని కొనే పాఠకులకోసం ప్రత్యేకమైన కథ ‘ఆంజమ్మ బస్సు ప్రయాణం’
♥ ప్రఖ్యాత సినీ రచయిత, నటులు, విద్వత్ సంపన్నులు తనికెళ్ల భరణి ఈ పుస్తకానికి ముందుమాట రాశారు.
♥ ‘టీనా’ కథ గురించి ప్రసిద్ధ కథారచయిత ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన ప్రత్యేక వ్యాసం కూడా ఇందులో ఉంది.
♥ శాంపిల్ స్టోరీ గా- తెల్సా వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ ‘గేణమ్మ’ లో కొంత భాగం ఇవ్వడం జరిగింది.
♥ సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు గీసిన ముఖచిత్రం
♥ తెల్సా, నాటా పోటీల్లో బహుమతి పొందిన కథలు. ఆంధ్రజ్యోతి ఆదివారం, తానా తెలుగుపలుకు, సారంగ వెబ్ మేగజైన్, ఖమ్మం ఈస్థటిక్స్ వారి పోటీ కథల సకలనం తదితర మాధ్యమాల్లో ప్రచురితమైన కథలు.
♥ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
♥ ISBN no. 978-81-968295-6-8
♥ సుప్రసిద్ధ సాహితీవేత్త, సినీ దర్శకులు, నటులు తనికెళ్ల భరణి ముందుమాట ‘తిరుపతి లడ్డూలు!!’ (క్లిక్ చేయండి)
♥ గేణమ్మ కథలో కొంత భాగం కథాప్రియుల కోసం (క్లిక్ చేయండి)
♥ టీనా కథ గురించి ప్రముఖ రచయిత, జర్నలిస్టు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన వ్యాసం కోసం (క్లిక్ చేయండి)
♥ కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు (ఇక్కడ క్లిక్ చేయండి)
Reviews
There are no reviews yet.