Suresh Pillai

Category: Articles

  • చూపున్న కర్ర!

    చూపున్న కర్ర!

    నేను అంధుడినని ప్రపంచానికి చాటింపు వేస్తూ.. ‘వైట్ కేన్’ లాగా నిన్ను చెంత ఉంచుకునే కదా..  ఇన్నాళ్లూ ప్రతి అడుగూ వేశాను! కుదిరినంత ప్రపంచం తిరిగాను!!   నా దారి  కంటకావృతమో.. గోతుల మయమో.. దుర్గమమో.. దుస్సహమో..  విషసర్ప భూషితమో.. కించిత్ సాహసోపేతమో.. నువ్వందించే హెచ్చరికలను బట్టే కదా.. నువ్వు సంకేతించే జాగరూకతలను అనుసరించే కదా..  నేను ప్రతిసారీ, ప్రతి ప్రస్థానంలోనూ.. మనగలుగుతూ, నెగ్గుతూ వచ్చాను!   నువ్వు నా వైట్ కేన్ వి! నా చూపువి.…

  • శీలా వీర్రాజు పురస్కార సభలో ధన్యవాద ప్రసంగం

    శీలా వీర్రాజు పురస్కార సభలో ధన్యవాద ప్రసంగం

    పెద్దలందరికీ నమస్సులు. ఎంతో గౌరవప్రదమైన శీలా వీర్రాజు కథానికా పురస్కారాన్ని అందుకుంటున్నందుకు శీలా సుభ్రదా దేవి గారికి, పెద్దలకు కృతజ్ఞతలు. 2023లో ప్రచురించిన నా మూడో కథా సంపుటి గారడీవాడుకు లభించిన నాలుగో అవార్డు ఇది. గతంలో లభించిన మూడు కూడా సంపుటులకు నిర్వహించిన పోటీలకు నేనుగా పంపితే దక్కినవి. కానీ.. ఇది ప్రత్యేకమైనది. నన్ను ఎంచుకుని, వరించిన అదృష్టం ఈ శీలావీ పురస్కారం. == ఇవాళ ఈ పురస్కారానికి అర్హుడిగా నన్ను నిలబెట్టిన… నా మూడో…

  • కథల అత్తరు సీసా (ముందుమాట)

    కథల అత్తరు సీసా (ముందుమాట)

    చాగంటి ప్రసాద్ కథా సంపుటి ‘పరిష్వంగం’కు ముందుమాట కథాశాస్త్రం నాకు తెలియదు. కథల రూపసౌందర్యాలు వస్తు గుణ విశేషాలను విడివిడిగా తూకం వేసి, లక్షణ విభాగం చేసి వాటి మంచి చెడులను చర్చించగల నేర్పు అస్సలు లేదు. నాకు తెలిసినదెల్లా కథల ప్రవాహంలో కొట్టుకుపోవడం మాత్రమే. కథలను ఇష్టపడడం మాత్రమే. కథలను చదువుతూ అవి పంచగల అనుభూతి సౌందర్యాన్ని ఆస్వాదించడం మాత్రమే. అవి పొందుపరచుకున్న అనుభవసారాన్ని సంగ్రహించడం మాత్రమే. మంచి కథను చదివినప్పుడు సమ్మోహితుడుని కావడం,  పేలవమైన…

  • పగటి వేషగాడు (కవిత)

    పగటి వేషగాడు (కవిత)

    నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద చీముగడ్డలా వివర్ణుడైన సూర్యుడు! తెల్లారుతుంది. అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు.. గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు! పలకరింపు ఒక కత్తి తునక.. ‘ఇలా ఎలా?’ ప్రతిసారీ ఒక పృచ్ఛ శలాక పొడుచుకుంటుంది..! జన్మాంతానికీ మానని గాయాన్ని కెలుకుతుంటుంది.. వేదన ప్రచ్ఛన్నంగా గుండె తెరచుకుంటుంది.. మీట నొక్కినట్టుగా.. నాలుగు మాటలు అప్పజెప్పేస్తాను! అశ్రురహిత భావరహిత ప్రేలాపనలాగా! ఏ పాతాళంలోకీ కూరుకుపోలేని అశక్తత.. ఆప్తులు వొస్తారు.. నన్ను ముంచి…

  • నైతిక కథా సంపద (ముందుమాట)

    నైతిక కథా సంపద (ముందుమాట)

    రోహిణి వంజారి కథాసంపుటి ‘నల్లసూరీడు’కు ముందుమాట ఒక రచయిత రాసే కథలోని బాధానందాలు, కష్టసుఖాలు, మానవీయ అనుభూతులు సమస్తం, ప్రతి సందర్భంలోనూ వారి స్వీయ అనుభవాలు అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ, కనీసం దృశ్యంగా, శ్రవణంగానైనా వాటిని ఎరిగి ఉండాలి. అంతే తప్ప.. ఊహల్లో ఒక అనుభూతికి రెసిపీ సిద్ధం చేసి, తద్భవమైన వంటకాన్ని పాఠకులకు వడ్డిస్తే అంతకు మించిన నేరం మరొకటి ఉండదు. కథలోని ప్రతి భావస్పందన రచయితకు తెలిసి ఉండాలి. ఊహ అత్యంత…

  • న వినుతి.. నా వినతి.. (ముందుమాట)

    న వినుతి.. నా వినతి.. (ముందుమాట)

    కూర్చుని తింటూ ఉంటే.. తన తర్వాతి తరాలు గూడా నిమ్మళంగా రోజులు గడిపేయడానికి వెసులుబాటు కల్పించగల ఒక ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని… యిచ్ఛాపూర్వకంగా పాత్రికేయ వ్రతంలోకి ప్రవేశించినవాడు ఎల్లయ్య.  మదరాసులో- పెద్దదిక్కు అయిన మిత్రుడి పత్రికా ప్రెస్సులో ఉద్యోగం, వేర్వేరు పత్రికల స్థాపనలు, మూసివేతలు తర్వాత 1970లో ఆయన స్థాపించిన వారపత్రిక ‘ఆదర్శిని’. రెండున్నరేళ్ల తర్వాత.. ఎల్లయ్య- భారతమ్మ దంపతులకు పుట్టిన ఒకే ఒక్క కొడుకు నేను. ఆ రకంగా తల్లిదండ్రుల ద్వారా నాకున్న ఏకైక తోబుట్టువు ‘ఆదర్శిని’.…

  • ఒక అతీతుడి ప్రయత్నం (ముందుమాట)

    ఒక అతీతుడి ప్రయత్నం (ముందుమాట)

    దేవీప్రసాద్ ఒబ్బు కథా సంపుటి ‘సాగరం సాక్షిగా..’కు ముందుమాట కథల సంకలనానికి ఇది ముందుమాట కాదు. ఒక గుత్తిగా అమరుతున్న కథా సుమాలను ఆఘ్రాణించి.. ఆలోచించి, ఆగ్రహించి ఆ పరిమళాలలను నిశ్వసించకుండా నాలోనే దాచుకోగల వాడిని మాత్రమే నేను. అంతేతప్ప, కథల గుణవిశేషాలను పుటం వేసి వాటి సందేశాలను, లాక్షణిక సౌందర్యాన్ని ప్రశంసించగల, అధిక్షేపించగల ప్రజ్ఞ, విజ్ఞత నాకు లేవు. నా అనర్హతల గురించి నాకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. కానీ, తరాలుగా పెనవడిన బంధాల వలన…