Your cart is currently empty!
Category: Poetry
-

చున్నీ కింద.. (కవిత)
అవును, చున్నీ ఎరగని, నా చుడీదార్ కింద రొమ్ములే ఉన్నాయి! ఆడది తారసపడగానే రతిక్రీడ తప్ప మరో ఆలోచన చేయలేని పశువుకు మాత్రమే కనిపించే రొమ్ములు! వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని చూడలేని గుడ్డి వెధవను మాత్రమే ఆకర్షించే రొమ్ములు!! అంగస్తంభనలు ఉడిగిపోయిన వాడికి కూడా భావప్రాప్తిని అందించే రొమ్ములు!! నావైన చైతన్యాలు.. ఊపిరాడనివ్వని కార్య భారాల మధ్య నా దృక్కులలో ఏ ప్రత్యేక విలువనూ సంతరించుకోక.. నా చేతలలో ఏ కొత్త గౌరవమూ పొందలేక.. నా…
-

‘మునివాక్యం’కు మక్కెన రామసుబ్బయ్య మనో వికాస సాహిత్య పురస్కారం
గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో సామాజికాంశాలపై రాసిన సంపాదకీయ కథనాల సంపుటి మునివాక్యం కు 2023 సంవత్సరానికి గాను మక్కెన రామసుబ్బయ్య ఉత్తమ మనోవికాస/ మనో వైజ్ఞానిక సాహిత్య పురస్కారం లభించింది. 2024 జులై 22న విశాఖ పౌరగ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మక్కెన శ్రీను గారికి కృతజ్ఞతలు. [huge_it_gallery id=”6″]
-

ఆ చివరిసారి.. (కవిత)
1 ఎప్పుడైతే చివరిసారిగా నువ్వు నన్ను కలిశావో.. అధరాల మీదుగా అమృతాన్ని నాలోకి వొంపావు! దరహాసాల మీదుగా మైమరపును నాలో నింపావు! ఎప్పుడైతే చివరిసారిగా మనిద్దరం శయనించామో.. గుండెలపై ఆర్తిగా సేదతీర్చావు! దేహగంధాన్ని అలది నన్ను పరిమళ భరితుణ్ని చేశావు! 2 ఎప్పుడైతే చివరిసారిగా నువ్వూ నేనూ భేటీ చేశామో.. ఆలోచనల చైతన్యాన్ని నాలోకి ప్రవహింపజేశావు! ఎల్లల్లేని జ్ఞానాంబుధిలో నన్ను ఓలలాడించావు! ఎప్పుడైతే చివరిసారిగా నీతో నేను బాటను పంచుకున్నానో.. మాటలు రాజేసిన అగ్నితో నాలో చురుకును…
-

అంతః క్షతం (కవిత)
దేహం లోపలి భాగంలో గాయం త్వరగా మానుతుందంటుంది శాస్త్రం.. అలా మానని, మానే అవకాశం లేని గాయాలను చూపుతుంది అనుభవం.. అవి- చిరంతన, చిద్రూప అంతఃక్షతాలు! * * * మనకు ముందు.. మరొకరు అడుగు పెట్టనే లేదు! మన తర్వాత.. మరొకరు ఆ ప్రయత్నం చేయలేదు! ‘మనం’ అని ప్లూరల్‌గా పలకడంలో… ‘సింగులర్’ కాంప్లెక్స్‌ను పీక పిసికి చంపేయగలమనే… ధైర్యం, పొగరు, దిలాసా..! అయితే అవి- ఆందోళన, భయం, వేదనా జనితాలు!! * * *…
-

అ… యిష్టం
అదంటే నాకు, అదొక రకం అయిష్టం… ఎందుకో.. ఏమో… పసితనం నుంచీ ఆ రకం క్లయిమాక్స్ నాకెన్నడూ రుచించలా… పడటం కొత్త కాదు, తిరిగి లేవటమూ పాతబళ్లేదు పడిపోయే ఉండరాదనే, …బోమనే నిర్వేదాంతక కుహనా తత్వం! ఓటమి కొత్త కాదు గెలిచినట్లు గురుతు లేదు అయితే- ఓటమి మళ్లీ ఎదురవకుండా, యుద్ధానికి దిగకపోవడమే మేలనే వంచనాత్మక ఆత్మ జ్ఞానం!! ‘తత్వ- జ్ఞానం’ బహు మెండు నాకు… అదే లుప్తమై ఉంటే గనుక, ఏనాడో దానిని…
-

ప్రభో… (కవిత)
‘‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు! అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు’’ …ఖరారే, అన్నమయ్యకు దైవత్వం బోధపడే ఉంటుంది! లేకుంటే, నిన్ను చూడకుండా అలా ఎలా రాయగలడు? త్యాగయ్యకు నీ పరిచయం ఉండే ఉంటే- ‘చాల సరళమయ హేల, సుగుణ గుణశీల, బుధ శిష్య లోల, విధృత శర జాల, శుభకర కరుణాల వాల, ఘన జ్ఞాన భవ్య మన మాలికాభరణ’ అని నుతించకుండా ఎలా ఉండగలడు? === జ్ఞానాంబుధి…
-

అ… యిష్టం
అదంటే నాకు, అదొక రకం అయిష్టం… ఎందుకో.. ఏమో… పసితనం నుంచీ ఆ రకం క్లయిమాక్స్ నాకెన్నడూ రుచించలా… పడటం కొత్త కాదు, తిరిగి లేవటమూ పాతబళ్లేదు పడిపోయే ఉండరాదనే, …బోమనే నిర్వేదాంతక కుహనా తత్వం! ఓటమి కొత్త కాదు గెలిచినట్లు గురుతు లేదు అయితే- ఓటమి మళ్లీ ఎదురవకుండా, యుద్ధానికి దిగకపోవడమే మేలనే వంచనాత్మక ఆత్మ జ్ఞానం!! ‘తత్వ- జ్ఞానం’ బహు మెండు నాకు… అదే లుప్తమై ఉంటే గనుక, ఏనాడో దానిని…
-

‘లూప్’
ఇరులు మురిపిస్తాయి! కనులు బరువౌతాయి! వెనక, అంతర్ కుహరాల్లో జలసంద్రాలు పోటెత్తకుండానే ఆవిరైపోతుంటాయి!! తట్టుకోగలిగే గట్టు లేదు మరి!! దొంతరల్లోంచి ఒళ్లు విరుచుకుంటూ గమనాల కత్తులు పదును సరిజూసుకుంటాయి ఆ అగాథాల్లోకి తొంగిచూసినప్పుడెల్లా వికృతమైన అందం కనిపిస్తుంది- దాచుకోలేని పాత మొహంలో! మోహం ఎంత పని చేసింది చెప్మా? ప్రతిరోజూ ఆత్మహననం! నడిపగలే, తెల్లార్చడం… బండి నడవడం కోసమే బతకడం… సంజె గుంకగానే మళ్లీ చావడం… ఆత్మని గూటిలో దాచేసి అడుగులు…

