Suresh Pillai

Tag: eenadu

  • ప్రభో… (కవిత)

    ప్రభో… (కవిత)

    ‘‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు! అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు’’ …ఖరారే, అన్నమయ్యకు దైవత్వం బోధపడే ఉంటుంది! లేకుంటే, నిన్ను చూడకుండా అలా ఎలా రాయగలడు?   త్యాగయ్యకు నీ పరిచయం ఉండే ఉంటే- ‘చాల సరళమయ హేల, సుగుణ గుణశీల, బుధ శిష్య లోల, విధృత శర జాల, శుభకర కరుణాల వాల, ఘన  జ్ఞాన భవ్య మన మాలికాభరణ’ అని నుతించకుండా ఎలా ఉండగలడు? ===   జ్ఞానాంబుధి…

  • ‘లూప్’

    ‘లూప్’

    ఇరులు మురిపిస్తాయి! కనులు బరువౌతాయి! వెనక, అంతర్ కుహరాల్లో జలసంద్రాలు పోటెత్తకుండానే ఆవిరైపోతుంటాయి!! తట్టుకోగలిగే గట్టు లేదు మరి!!   దొంతరల్లోంచి ఒళ్లు విరుచుకుంటూ గమనాల కత్తులు పదును సరిజూసుకుంటాయి   ఆ అగాథాల్లోకి తొంగిచూసినప్పుడెల్లా వికృతమైన అందం కనిపిస్తుంది- దాచుకోలేని పాత మొహంలో!   మోహం ఎంత పని చేసింది చెప్మా? ప్రతిరోజూ ఆత్మహననం!   నడిపగలే, తెల్లార్చడం… బండి నడవడం కోసమే బతకడం… సంజె గుంకగానే మళ్లీ చావడం… ఆత్మని గూటిలో దాచేసి అడుగులు…