Your cart is currently empty!
Tag: muni suresh pillai
-

కథల అత్తరు సీసా (ముందుమాట)
చాగంటి ప్రసాద్ కథా సంపుటి ‘పరిష్వంగం’కు ముందుమాట కథాశాస్త్రం నాకు తెలియదు. కథల రూపసౌందర్యాలు వస్తు గుణ విశేషాలను విడివిడిగా తూకం వేసి, లక్షణ విభాగం చేసి వాటి మంచి చెడులను చర్చించగల నేర్పు అస్సలు లేదు. నాకు తెలిసినదెల్లా కథల ప్రవాహంలో కొట్టుకుపోవడం మాత్రమే. కథలను ఇష్టపడడం మాత్రమే. కథలను చదువుతూ అవి పంచగల అనుభూతి సౌందర్యాన్ని ఆస్వాదించడం మాత్రమే. అవి పొందుపరచుకున్న అనుభవసారాన్ని సంగ్రహించడం మాత్రమే. మంచి కథను చదివినప్పుడు సమ్మోహితుడుని కావడం, పేలవమైన…
-

ఒక అతీతుడి ప్రయత్నం (ముందుమాట)
దేవీప్రసాద్ ఒబ్బు కథా సంపుటి ‘సాగరం సాక్షిగా..’కు ముందుమాట కథల సంకలనానికి ఇది ముందుమాట కాదు. ఒక గుత్తిగా అమరుతున్న కథా సుమాలను ఆఘ్రాణించి.. ఆలోచించి, ఆగ్రహించి ఆ పరిమళాలలను నిశ్వసించకుండా నాలోనే దాచుకోగల వాడిని మాత్రమే నేను. అంతేతప్ప, కథల గుణవిశేషాలను పుటం వేసి వాటి సందేశాలను, లాక్షణిక సౌందర్యాన్ని ప్రశంసించగల, అధిక్షేపించగల ప్రజ్ఞ, విజ్ఞత నాకు లేవు. నా అనర్హతల గురించి నాకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. కానీ, తరాలుగా పెనవడిన బంధాల వలన…