Suresh Pillai

Tag: poem

  • పగటి వేషగాడు (కవిత)

    పగటి వేషగాడు (కవిత)

    నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద చీముగడ్డలా వివర్ణుడైన సూర్యుడు! తెల్లారుతుంది. అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు.. గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు! పలకరింపు ఒక కత్తి తునక.. ‘ఇలా ఎలా?’ ప్రతిసారీ ఒక పృచ్ఛ శలాక పొడుచుకుంటుంది..! జన్మాంతానికీ మానని గాయాన్ని కెలుకుతుంటుంది.. వేదన ప్రచ్ఛన్నంగా గుండె తెరచుకుంటుంది.. మీట నొక్కినట్టుగా.. నాలుగు మాటలు అప్పజెప్పేస్తాను! అశ్రురహిత భావరహిత ప్రేలాపనలాగా! ఏ పాతాళంలోకీ కూరుకుపోలేని అశక్తత.. ఆప్తులు వొస్తారు.. నన్ను ముంచి…

  • అంతః క్షతం (కవిత)

    అంతః క్షతం (కవిత)

    దేహం లోపలి భాగంలో గాయం త్వరగా మానుతుందంటుంది శాస్త్రం.. అలా మానని, మానే అవకాశం లేని గాయాలను చూపుతుంది అనుభవం.. అవి- చిరంతన, చిద్రూప అంతఃక్షతాలు! * * * మనకు ముందు.. మరొకరు అడుగు పెట్టనే లేదు! మన తర్వాత.. మరొకరు ఆ ప్రయత్నం చేయలేదు! ‘మనం’ అని ప్లూరల్‌గా పలకడంలో… ‘సింగులర్’ కాంప్లెక్స్‌ను పీక పిసికి చంపేయగలమనే… ధైర్యం, పొగరు, దిలాసా..! అయితే అవి- ఆందోళన, భయం, వేదనా జనితాలు!! * * *…

  • ఖర్మలో బండి‘ఱ’

    ఖర్మలో బండి‘ఱ’

    అరె.. ఎంత తేడా కొట్టేసింది చెప్మా! ‘ఖర్మ’ అంటే ప్రారబ్ధం కాదు! ‘పట్టుబట్టలూ లేదా పౌరుషమూ’ నట! నిఘంటువు నిర్దాక్షిణ్యంగా చెప్పేసింది. అవేవీ లేకుండానే, ఖర్మ ఉన్నదే బతుకులో! తప్పుడు అర్థమే సరైనదని అనుకుంటూ నిత్య వ్యవహారంలో వాడేస్తున్నామే…!   నిఘంటువుల్ని క్షమించి, కాస్త సవరించాలి.. జనవ్యవహారంలో నిలిచినదే జీవభాష మృత అర్థాలనూ, వ్యర్థ భాష్యాలనూ పాతర వేయండి మీ వ్యుత్పత్త్యార్థాలూ, భాషాప్రమాణాలూ కట్టిపెట్టండి ఖర్మంటే ప్రారబ్ధమే, ఒప్పుకోండి!   లేకుంటే, కోటానుకోట్ల దుఃఖభోగులం మేం కించపడి,…