చూపున్న కర్ర!
నేను అంధుడినని ప్రపంచానికి చాటింపు వేస్తూ.. ‘వైట్ కేన్’ లాగా నిన్ను చెంత ఉంచుకునే కదా.. ఇన్నాళ్లూ ప్రతి అడుగూ వేశాను! కుదిరినంత ప్రపంచం తిరిగాను!! నా దారి కంటకావృతమో.. గోతుల మయమో.. దుర్గమమో.. దుస్సహమో.. విషసర్ప భూషితమో.. కించిత్ సాహసోపేతమో.. నువ్వందించే హెచ్చరికలను బట్టే కదా.. నువ్వు సంకేతించే జాగరూకతలను అనుసరించే కదా.. నేను ప్రతిసారీ, ప్రతి ప్రస్థానంలోనూ.. మనగలుగుతూ, నెగ్గుతూ వచ్చాను! నువ్వు నా వైట్ కేన్ వి! నా చూపువి. …
అసలైన కథల గారడీవాడు సురేష్ పిళ్లె : ఎమ్వీ రామిరెడ్డి
కథల గారడీవాడు మునిసురేష్ పిళ్లె అని ప్రఖ్యాత రచయిత ఎమ్వీ రామిరెడ్డి అభివర్ణించారు. శీలా వీర్రాజు కథానికా పురస్కారం అందుకున్న సభలో ఆయన గారడీ వాడు పుస్తకాన్ని పరిచయం చేశారు.
శీలా వీర్రాజు పురస్కార సభలో ధన్యవాద ప్రసంగం
పెద్దలందరికీ నమస్సులు. ఎంతో గౌరవప్రదమైన శీలా వీర్రాజు కథానికా పురస్కారాన్ని అందుకుంటున్నందుకు శీలా సుభ్రదా దేవి గారికి, పెద్దలకు కృతజ్ఞతలు. 2023లో ప్రచురించిన నా మూడో కథా సంపుటి గారడీవాడుకు లభించిన నాలుగో అవార్డు ఇది. గతంలో లభించిన మూడు కూడా సంపుటులకు నిర్వహించిన పోటీలకు నేనుగా పంపితే దక్కినవి. కానీ.. ఇది ప్రత్యేకమైనది. నన్ను ఎంచుకుని, వరించిన అదృష్టం ఈ శీలావీ పురస్కారం. == ఇవాళ ఈ పురస్కారానికి అర్హుడిగా నన్ను నిలబెట్టిన… నా మూడో …
శీలా వీర్రాజు కథానికా పురస్కార ప్రదానం
గారడీవాడు కథా సంపుటికి శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 లభించింది. 2023లో వెలువడిన ఈ కథాసంపుటికి ఇది నాలుగో పురస్కారం. పురస్కార ప్రదానోత్సవం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జూన్ 7వ తేదీ శనివారం సాయంత్రం జరిగింది. ప్రముఖ కథారచయిత శ్రీ విహారి, తెలంగాణ సాంస్కృతికశాఖ డైరక్టరు శ్రీ మామిడి హరికృష్ణ, సినీ దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, రామ్‌కీ ఫౌండేషన్ సీఈఓ, ప్రముఖ రచయిత ఎమ్వీ రామిరెడ్డి, ప్రముఖ చిత్రకారులు శీలావీ చిత్రకళా పురస్కార గ్రహీత …
శీలా వీర్రాజు వ్యక్తిత్వంలో సహస్రాంశం దక్కితే చాలు
సుప్రసిద్ధ కథారచయిత, కవి, చిత్రకారులు శీలా వీర్రాజు పేరిట ఏర్పాటైన శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 ను కె.ఎ. మునిసురేష్ పిళ్లె తన కథా సంపుటి గారడీవాడుకు గాను అందుకున్నారు. ఆ కార్యక్రమంలో సురేష్ పిళ్లె ధన్యవాద ప్రసంగం ఇది. సాహిత్యంలో, చిత్రకళా రంగంలో దక్కించుకున్న కీర్తిని మించిన సహృదయుడు, ఆప్తజన వత్సలుడు.. శీలా వీర్రాజు గారి పేరిట కథానికా పురస్కారాన్ని అందుకోవడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. అందుకు సుభద్రాదేవి గారికి మరోమారు కృతజ్ఞతలు.. …
శీలా వీర్రాజు వ్యక్తిత్వంలో సహస్రాంశం దక్కితే చాలు Read More »
యద్భావం తద్భవతి పుస్తకావిష్కరణ సభలో..
తిరుపతికి చెందిన సీనియర్ రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజు రాసిన ఆధ్యాత్మిక కథల సంపుటి ‘యద్భావం తద్భవతి’ ఆవిష్కరణ తిరుపతిలో మే 11వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రామక్రిష్ణ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద, శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ రాణి సదాశివమూర్తి, సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్, శ్రీ గరికపాటి రమేష్ లతో కలిసి అతిథిగా పాల్గొనడం జరిగింది.
గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం 2024 ప్రదానం
గారడీవాడు కథా సంపుటికి నెల్లూరులోని గోవిందరాజు సీతాదేవీ జాతీయస్థాయి సాహితీ పురస్కారం 2024 లభించింది. గోవిందరాజు సుభద్రదేవి గారికి కృతజ్ఞతలు నెల్లూరులో మే 10వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ అద్దేపల్లి ప్రభుగారు, శ్రీ సుంకర గోపాలయ్య గారు, శ్రీపెళ్లూరి సునీల్ గారు, శ్రీమతి గాయత్రి గారు, శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు అతిథులుగా పాల్గొన్నారు.






