Warning: The magic method Gallery_Img::__wakeup() must have public visibility in /home/adarsini/sureshpillai.com/wp-content/plugins/gallery-images/gallery-images.php on line 97
Articles – Suresh Pillai

Articles

చూపున్న కర్ర!

నేను అంధుడినని ప్రపంచానికి చాటింపు వేస్తూ.. ‘వైట్ కేన్’ లాగా నిన్ను చెంత ఉంచుకునే కదా..  ఇన్నాళ్లూ ప్రతి అడుగూ వేశాను! కుదిరినంత ప్రపంచం తిరిగాను!!   నా దారి  కంటకావృతమో.. గోతుల మయమో.. దుర్గమమో.. దుస్సహమో..  విషసర్ప భూషితమో.. కించిత్ సాహసోపేతమో.. నువ్వందించే హెచ్చరికలను బట్టే కదా.. నువ్వు సంకేతించే జాగరూకతలను అనుసరించే కదా..  నేను ప్రతిసారీ, ప్రతి ప్రస్థానంలోనూ.. మనగలుగుతూ, నెగ్గుతూ వచ్చాను!   నువ్వు నా వైట్ కేన్ వి! నా చూపువి. …

చూపున్న కర్ర! Read More »

పగటి వేషగాడు (కవిత)

నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద చీముగడ్డలా వివర్ణుడైన సూర్యుడు! తెల్లారుతుంది. అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు.. గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు! పలకరింపు ఒక కత్తి తునక.. ‘ఇలా ఎలా?’ ప్రతిసారీ ఒక పృచ్ఛ శలాక పొడుచుకుంటుంది..! జన్మాంతానికీ మానని గాయాన్ని కెలుకుతుంటుంది.. వేదన ప్రచ్ఛన్నంగా గుండె తెరచుకుంటుంది.. మీట నొక్కినట్టుగా.. నాలుగు మాటలు అప్పజెప్పేస్తాను! అశ్రురహిత భావరహిత ప్రేలాపనలాగా! ఏ పాతాళంలోకీ కూరుకుపోలేని అశక్తత.. ఆప్తులు వొస్తారు.. నన్ను ముంచి …

పగటి వేషగాడు (కవిత) Read More »

గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత

హైదరాబాదు మణికొండలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం (కార్యక్రమం ఏర్పాటుచేసిన ప్రభోదిత స్వచ్ఛంద సంస్థ సారథి శ్రీమతి జయభారతి గారికి, ప్రధానోపాధ్యాయులు నాగార్జున గారికి కృతజ్ఞతలు) గ్రంథాలయాలు అంటే  మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని పుస్తకాలను ఒక చోట చేరిస్తే దాన్ని లైబ్రరీ అంటాం. గ్రంథాలయం అంటే గ్రంథాలన్నీ ఉండే ఒక ప్రదేశం. కాబట్టి, గ్రంథాలయాల గురించి చెప్పడానికంటె ముందు.. పుస్తకం గురించి చెప్పాలి. పుస్తకాన్ని మనం కొద్దిగా బరువైన భాషలో గ్రంథం …

గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత Read More »

న వినుతి.. నా వినతి.. (ముందుమాట)

కూర్చుని తింటూ ఉంటే.. తన తర్వాతి తరాలు గూడా నిమ్మళంగా రోజులు గడిపేయడానికి వెసులుబాటు కల్పించగల ఒక ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని… యిచ్ఛాపూర్వకంగా పాత్రికేయ వ్రతంలోకి ప్రవేశించినవాడు ఎల్లయ్య.  మదరాసులో- పెద్దదిక్కు అయిన మిత్రుడి పత్రికా ప్రెస్సులో ఉద్యోగం, వేర్వేరు పత్రికల స్థాపనలు, మూసివేతలు తర్వాత 1970లో ఆయన స్థాపించిన వారపత్రిక ‘ఆదర్శిని’. రెండున్నరేళ్ల తర్వాత.. ఎల్లయ్య- భారతమ్మ దంపతులకు పుట్టిన ఒకే ఒక్క కొడుకు నేను. ఆ రకంగా తల్లిదండ్రుల ద్వారా నాకున్న ఏకైక తోబుట్టువు ‘ఆదర్శిని’. …

న వినుతి.. నా వినతి.. (ముందుమాట) Read More »

ఆఫ్గన్ విలువ ఆంధ్రప్రదేశ్ కు లేదా?

తాజాగా ట్రంప్ మనకు ఒక మేలు చేశారు.  ఇరుగు పొరుగు దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్ని ఎగతాళి చేశారు. దేశవ్యాప్తంగా రాద్ధాంతం రేగింది. అంతర్జాతీయ యవనికపై ఈ ఎగతాళి మాటల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ దురహంకార స్వరాన్ని తిప్పికొట్టడానికి కేంద్రప్రభుత్వం తగురీతిలో స్పందిస్తోంది. అయితే… రెండో పార్శ్వం నుంచి చూసినప్పుడు… ఈ ఎగతాళి మాటల ద్వారా.. ట్రంప్ మనకు ఒక మేలు చేశారని తెలుస్తుంది. ఆర్తిలో ఉన్న వారికి మనదేశం ఎంత సాయం చేస్తున్నదో, యావత్ …

ఆఫ్గన్ విలువ ఆంధ్రప్రదేశ్ కు లేదా? Read More »