admin

ఆ చివరిసారి.. (కవిత)

1 ఎప్పుడైతే చివరిసారిగా నువ్వు నన్ను కలిశావో.. అధరాల మీదుగా అమృతాన్ని నాలోకి వొంపావు! దరహాసాల మీదుగా మైమరపును నాలో నింపావు! ఎప్పుడైతే చివరిసారిగా మనిద్దరం శయనించామో.. గుండెలపై ఆర్తిగా సేదతీర్చావు! దేహగంధాన్ని అలది నన్ను పరిమళ భరితుణ్ని చేశావు! 2 ఎప్పుడైతే చివరిసారిగా నువ్వూ నేనూ భేటీ చేశామో.. ఆలోచనల చైతన్యాన్ని నాలోకి ప్రవహింపజేశావు! ఎల్లల్లేని జ్ఞానాంబుధిలో నన్ను ఓలలాడించావు! ఎప్పుడైతే చివరిసారిగా నీతో నేను బాటను పంచుకున్నానో.. మాటలు రాజేసిన అగ్నితో నాలో చురుకును …

ఆ చివరిసారి.. (కవిత) Read More »

నైతిక కథా సంపద (ముందుమాట)

రోహిణి వంజారి కథాసంపుటి ‘నల్లసూరీడు’కు ముందుమాట ఒక రచయిత రాసే కథలోని బాధానందాలు, కష్టసుఖాలు, మానవీయ అనుభూతులు సమస్తం, ప్రతి సందర్భంలోనూ వారి స్వీయ అనుభవాలు అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ, కనీసం దృశ్యంగా, శ్రవణంగానైనా వాటిని ఎరిగి ఉండాలి. అంతే తప్ప.. ఊహల్లో ఒక అనుభూతికి రెసిపీ సిద్ధం చేసి, తద్భవమైన వంటకాన్ని పాఠకులకు వడ్డిస్తే అంతకు మించిన నేరం మరొకటి ఉండదు. కథలోని ప్రతి భావస్పందన రచయితకు తెలిసి ఉండాలి. ఊహ అత్యంత …

నైతిక కథా సంపద (ముందుమాట) Read More »

‘రిఫ్రెష్ ఫ్రం టియర్స్’ కథపై శింజిని ఛానెల్ కథాచర్చ

https://www.youtube.com/watch?v=RgDRJthCbRY (ఈ లింక్ బ్రౌజర్ లో చూడగలరు) సారంగలో ప్రచురితమైన ‘‘రిఫ్రెష్ ఫ్రం టియర్స్’’ కథ గురించి దేవరకొండ అన్నపూర్ణ- నారాయణ స్వామి శింజిని యూట్యూబ్ ఛానెల్ లో సాగించిన కథా చర్చ

అంతః క్షతం (కవిత)

దేహం లోపలి భాగంలో గాయం త్వరగా మానుతుందంటుంది శాస్త్రం.. అలా మానని, మానే అవకాశం లేని గాయాలను చూపుతుంది అనుభవం.. అవి- చిరంతన, చిద్రూప అంతఃక్షతాలు! * * * మనకు ముందు.. మరొకరు అడుగు పెట్టనే లేదు! మన తర్వాత.. మరొకరు ఆ ప్రయత్నం చేయలేదు! ‘మనం’ అని ప్లూరల్‌గా పలకడంలో… ‘సింగులర్’ కాంప్లెక్స్‌ను పీక పిసికి చంపేయగలమనే… ధైర్యం, పొగరు, దిలాసా..! అయితే అవి- ఆందోళన, భయం, వేదనా జనితాలు!! * * * …

అంతః క్షతం (కవిత) Read More »

అ… యిష్టం

అదంటే నాకు, అదొక రకం అయిష్టం… ఎందుకో.. ఏమో… పసితనం నుంచీ ఆ రకం క్లయిమాక్స్ నాకెన్నడూ రుచించలా…   పడటం కొత్త కాదు, తిరిగి లేవటమూ పాతబళ్లేదు పడిపోయే ఉండరాదనే, …బోమనే నిర్వేదాంతక కుహనా తత్వం! ఓటమి కొత్త కాదు గెలిచినట్లు గురుతు లేదు అయితే- ఓటమి మళ్లీ ఎదురవకుండా, యుద్ధానికి దిగకపోవడమే మేలనే వంచనాత్మక ఆత్మ జ్ఞానం!!   ‘తత్వ- జ్ఞానం’ బహు మెండు నాకు… అదే లుప్తమై ఉంటే గనుక, ఏనాడో దానిని …

అ… యిష్టం Read More »

ప్రభో… (కవిత)

‘‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు! అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు’’ …ఖరారే, అన్నమయ్యకు దైవత్వం బోధపడే ఉంటుంది! లేకుంటే, నిన్ను చూడకుండా అలా ఎలా రాయగలడు?   త్యాగయ్యకు నీ పరిచయం ఉండే ఉంటే- ‘చాల సరళమయ హేల, సుగుణ గుణశీల, బుధ శిష్య లోల, విధృత శర జాల, శుభకర కరుణాల వాల, ఘన  జ్ఞాన భవ్య మన మాలికాభరణ’ అని నుతించకుండా ఎలా ఉండగలడు? ===   జ్ఞానాంబుధి …

ప్రభో… (కవిత) Read More »

గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత

హైదరాబాదు మణికొండలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం (కార్యక్రమం ఏర్పాటుచేసిన ప్రభోదిత స్వచ్ఛంద సంస్థ సారథి శ్రీమతి జయభారతి గారికి, ప్రధానోపాధ్యాయులు నాగార్జున గారికి కృతజ్ఞతలు) గ్రంథాలయాలు అంటే  మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని పుస్తకాలను ఒక చోట చేరిస్తే దాన్ని లైబ్రరీ అంటాం. గ్రంథాలయం అంటే గ్రంథాలన్నీ ఉండే ఒక ప్రదేశం. కాబట్టి, గ్రంథాలయాల గురించి చెప్పడానికంటె ముందు.. పుస్తకం గురించి చెప్పాలి. పుస్తకాన్ని మనం కొద్దిగా బరువైన భాషలో గ్రంథం …

గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత Read More »

అ… యిష్టం

అదంటే నాకు, అదొక రకం అయిష్టం… ఎందుకో.. ఏమో… పసితనం నుంచీ ఆ రకం క్లయిమాక్స్ నాకెన్నడూ రుచించలా…   పడటం కొత్త కాదు, తిరిగి లేవటమూ పాతబళ్లేదు పడిపోయే ఉండరాదనే, …బోమనే నిర్వేదాంతక కుహనా తత్వం! ఓటమి కొత్త కాదు గెలిచినట్లు గురుతు లేదు అయితే- ఓటమి మళ్లీ ఎదురవకుండా, యుద్ధానికి దిగకపోవడమే మేలనే వంచనాత్మక ఆత్మ జ్ఞానం!!   ‘తత్వ- జ్ఞానం’ బహు మెండు నాకు… అదే లుప్తమై ఉంటే గనుక, ఏనాడో దానిని …

అ… యిష్టం Read More »

‘లూప్’

ఇరులు మురిపిస్తాయి! కనులు బరువౌతాయి! వెనక, అంతర్ కుహరాల్లో జలసంద్రాలు పోటెత్తకుండానే ఆవిరైపోతుంటాయి!! తట్టుకోగలిగే గట్టు లేదు మరి!!   దొంతరల్లోంచి ఒళ్లు విరుచుకుంటూ గమనాల కత్తులు పదును సరిజూసుకుంటాయి   ఆ అగాథాల్లోకి తొంగిచూసినప్పుడెల్లా వికృతమైన అందం కనిపిస్తుంది- దాచుకోలేని పాత మొహంలో!   మోహం ఎంత పని చేసింది చెప్మా? ప్రతిరోజూ ఆత్మహననం!   నడిపగలే, తెల్లార్చడం… బండి నడవడం కోసమే బతకడం… సంజె గుంకగానే మళ్లీ చావడం… ఆత్మని గూటిలో దాచేసి అడుగులు …

‘లూప్’ Read More »