Warning: The magic method Gallery_Img::__wakeup() must have public visibility in /home/adarsini/sureshpillai.com/wp-content/plugins/gallery-images/gallery-images.php on line 97
admin – Page 4 – Suresh Pillai

admin

న వినుతి.. నా వినతి.. (ముందుమాట)

కూర్చుని తింటూ ఉంటే.. తన తర్వాతి తరాలు గూడా నిమ్మళంగా రోజులు గడిపేయడానికి వెసులుబాటు కల్పించగల ఒక ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని… యిచ్ఛాపూర్వకంగా పాత్రికేయ వ్రతంలోకి ప్రవేశించినవాడు ఎల్లయ్య.  మదరాసులో- పెద్దదిక్కు అయిన మిత్రుడి పత్రికా ప్రెస్సులో ఉద్యోగం, వేర్వేరు పత్రికల స్థాపనలు, మూసివేతలు తర్వాత 1970లో ఆయన స్థాపించిన వారపత్రిక ‘ఆదర్శిని’. రెండున్నరేళ్ల తర్వాత.. ఎల్లయ్య- భారతమ్మ దంపతులకు పుట్టిన ఒకే ఒక్క కొడుకు నేను. ఆ రకంగా తల్లిదండ్రుల ద్వారా నాకున్న ఏకైక తోబుట్టువు ‘ఆదర్శిని’. …

న వినుతి.. నా వినతి.. (ముందుమాట) Read More »

ఒక అతీతుడి ప్రయత్నం (ముందుమాట)

దేవీప్రసాద్ ఒబ్బు కథా సంపుటి ‘సాగరం సాక్షిగా..’కు ముందుమాట కథల సంకలనానికి ఇది ముందుమాట కాదు. ఒక గుత్తిగా అమరుతున్న కథా సుమాలను ఆఘ్రాణించి.. ఆలోచించి, ఆగ్రహించి ఆ పరిమళాలలను నిశ్వసించకుండా నాలోనే దాచుకోగల వాడిని మాత్రమే నేను. అంతేతప్ప, కథల గుణవిశేషాలను పుటం వేసి వాటి సందేశాలను, లాక్షణిక సౌందర్యాన్ని ప్రశంసించగల, అధిక్షేపించగల ప్రజ్ఞ, విజ్ఞత నాకు లేవు. నా అనర్హతల గురించి నాకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. కానీ, తరాలుగా పెనవడిన బంధాల వలన …

ఒక అతీతుడి ప్రయత్నం (ముందుమాట) Read More »

తెల్లబజారులో వెంకన్న విక్రయం.. మొదటికే మోసం!

ఒక వ్యవస్థలో కొత్త పాలకులు వచ్చినప్పుడు.. తమ ముద్ర కోసం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఆయా నిర్ణయాలకు ఎదురయ్యే ఫలితాలను బట్టి.. లోటుపాట్లు గుర్తించేకొద్దీ వాటిని దిద్దుకుంటారు. కొన్ని సార్లు చిత్రమైన పరిస్థితి ఉంటుంది. లోపాలు బయటపడే సరికి.. దిద్దలేని దుస్థితి ఏర్పడి ఉంటుంది. కొత్త విధానాలను కార్యరూపంలో పెట్టేప్పుడు, సుదూర పరిణామాలను అంచనావేయడంలో తేడాల వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో, పరిణామాల గురించిన కొన్ని భయాలు కలిగినప్పుడు.. వాటిపై చర్చ …

తెల్లబజారులో వెంకన్న విక్రయం.. మొదటికే మోసం! Read More »

అమ్మలూ.. బాబులూ… కళ్లు తెరవాలి!

జీవితం అంటే ఏమిటి? భార్య-భర్త కలిసి బతకడం. మహా అయితే పిల్లలు. తమ బాధానందాలన్నింటినీ కలసి పంచుకోవడం మాత్రమేనా జీవితం అంటే! జీవితం అనే వ్యవహారంలోకి మరెవ్వరి ప్రమేయమూ ఉండదా? కేవలం దంపతులు మాత్రమే అనుభవించేది జీవితం కాబోదని, తమ పిల్లలతో కలిసి పంచుకోవాల్సిందేనని చెప్పే స్పృహ అందరికీ ఉంటోంది. కానీ, తాము పిల్లలతో పంచుకునేదే జీవితం అనుకుంటూ… తాము పిల్లలుగా తమతో జీవితాన్ని పంచుకున్న పెద్దలను… తమ జీవితానికి బయటి వ్యక్తులుగా చూడడం అనేది ఎలాంటి …

అమ్మలూ.. బాబులూ… కళ్లు తెరవాలి! Read More »

సర్వోన్నత తీర్పు అపరిపక్వమా?

‘మరొక వ్యక్తి భార్యతో శృంగార సంబంధం కలిగి ఉంటే తప్పా కాదా?’ ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తప్పొప్పులు అనేవి అభిప్రాయాలు! వీటికి ‘సామాజిక’ అనే పదం జోడించింది సర్వోన్నత న్యాయస్థానం. ఎటొచ్చీ ఇవి అభిప్రాయాలు మాత్రమే… ‘సామాజిక’మైనవి మాత్రమే గనుక.. సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత- ఇది తప్పు కాదు అనే వాళ్లూ మనలో ఉంటారు. అలాగే ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తప్పే’ అనే వాళ్లు, తొలినుంచీ ఉండనే ఉన్నారు. ‘తప్పు’ గోల …

సర్వోన్నత తీర్పు అపరిపక్వమా? Read More »

ఖర్మలో బండి‘ఱ’

అరె.. ఎంత తేడా కొట్టేసింది చెప్మా! ‘ఖర్మ’ అంటే ప్రారబ్ధం కాదు! ‘పట్టుబట్టలూ లేదా పౌరుషమూ’ నట! నిఘంటువు నిర్దాక్షిణ్యంగా చెప్పేసింది. అవేవీ లేకుండానే, ఖర్మ ఉన్నదే బతుకులో! తప్పుడు అర్థమే సరైనదని అనుకుంటూ నిత్య వ్యవహారంలో వాడేస్తున్నామే…!   నిఘంటువుల్ని క్షమించి, కాస్త సవరించాలి.. జనవ్యవహారంలో నిలిచినదే జీవభాష మృత అర్థాలనూ, వ్యర్థ భాష్యాలనూ పాతర వేయండి మీ వ్యుత్పత్త్యార్థాలూ, భాషాప్రమాణాలూ కట్టిపెట్టండి ఖర్మంటే ప్రారబ్ధమే, ఒప్పుకోండి!   లేకుంటే, కోటానుకోట్ల దుఃఖభోగులం మేం కించపడి, …

ఖర్మలో బండి‘ఱ’ Read More »

ఆఫ్గన్ విలువ ఆంధ్రప్రదేశ్ కు లేదా?

తాజాగా ట్రంప్ మనకు ఒక మేలు చేశారు.  ఇరుగు పొరుగు దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్ని ఎగతాళి చేశారు. దేశవ్యాప్తంగా రాద్ధాంతం రేగింది. అంతర్జాతీయ యవనికపై ఈ ఎగతాళి మాటల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ దురహంకార స్వరాన్ని తిప్పికొట్టడానికి కేంద్రప్రభుత్వం తగురీతిలో స్పందిస్తోంది. అయితే… రెండో పార్శ్వం నుంచి చూసినప్పుడు… ఈ ఎగతాళి మాటల ద్వారా.. ట్రంప్ మనకు ఒక మేలు చేశారని తెలుస్తుంది. ఆర్తిలో ఉన్న వారికి మనదేశం ఎంత సాయం చేస్తున్నదో, యావత్ …

ఆఫ్గన్ విలువ ఆంధ్రప్రదేశ్ కు లేదా? Read More »