Suresh Pillai

Category: Children Stories

  • చూపున్న కర్ర!

    చూపున్న కర్ర!

    నేను అంధుడినని ప్రపంచానికి చాటింపు వేస్తూ.. ‘వైట్ కేన్’ లాగా నిన్ను చెంత ఉంచుకునే కదా..  ఇన్నాళ్లూ ప్రతి అడుగూ వేశాను! కుదిరినంత ప్రపంచం తిరిగాను!!   నా దారి  కంటకావృతమో.. గోతుల మయమో.. దుర్గమమో.. దుస్సహమో..  విషసర్ప భూషితమో.. కించిత్ సాహసోపేతమో.. నువ్వందించే హెచ్చరికలను బట్టే కదా.. నువ్వు సంకేతించే జాగరూకతలను అనుసరించే కదా..  నేను ప్రతిసారీ, ప్రతి ప్రస్థానంలోనూ.. మనగలుగుతూ, నెగ్గుతూ వచ్చాను!   నువ్వు నా వైట్ కేన్ వి! నా చూపువి.…

  • శీలా వీర్రాజు వ్యక్తిత్వంలో సహస్రాంశం దక్కితే చాలు

    శీలా వీర్రాజు వ్యక్తిత్వంలో సహస్రాంశం దక్కితే చాలు

    సుప్రసిద్ధ కథారచయిత, కవి, చిత్రకారులు శీలా వీర్రాజు పేరిట ఏర్పాటైన శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 ను కె.ఎ. మునిసురేష్ పిళ్లె తన కథా సంపుటి గారడీవాడుకు గాను అందుకున్నారు. ఆ కార్యక్రమంలో సురేష్ పిళ్లె ధన్యవాద ప్రసంగం ఇది. సాహిత్యంలో, చిత్రకళా రంగంలో దక్కించుకున్న కీర్తిని మించిన సహృదయుడు, ఆప్తజన వత్సలుడు.. శీలా వీర్రాజు గారి పేరిట కథానికా పురస్కారాన్ని అందుకోవడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. అందుకు సుభద్రాదేవి గారికి మరోమారు కృతజ్ఞతలు..…

  • బాగా మధనపడినప్పుడే రాయడం నా అలవాటు

    బాగా మధనపడినప్పుడే రాయడం నా అలవాటు

  • గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం 2024 ప్రదానం

    గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం 2024 ప్రదానం

    గారడీవాడు కథా సంపుటికి నెల్లూరులోని గోవిందరాజు సీతాదేవీ జాతీయస్థాయి సాహితీ పురస్కారం 2024 లభించింది. గోవిందరాజు సుభద్రదేవి గారికి కృతజ్ఞతలు నెల్లూరులో మే 10వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ అద్దేపల్లి ప్రభుగారు, శ్రీ సుంకర గోపాలయ్య గారు, శ్రీపెళ్లూరి సునీల్ గారు, శ్రీమతి గాయత్రి గారు, శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు అతిథులుగా పాల్గొన్నారు. [huge_it_gallery id=”4″]

  • $100 Free Chip No Deposit: Unlocking the World of Online Gaming

    6 Science-Backed Benefits Of Hemp Oil + Why Full Spectrum Is Better Products derived from the Cannabis sativa plant are hitting the market like a tidal wave, offering numerous health benefits. Among these, free chips online casino enthusiasts find hemp oil particularly appealing due to its potential to enhance mental clarity and reduce stress. Full…

  • కథల అత్తరు సీసా (ముందుమాట)

    కథల అత్తరు సీసా (ముందుమాట)

    చాగంటి ప్రసాద్ కథా సంపుటి ‘పరిష్వంగం’కు ముందుమాట కథాశాస్త్రం నాకు తెలియదు. కథల రూపసౌందర్యాలు వస్తు గుణ విశేషాలను విడివిడిగా తూకం వేసి, లక్షణ విభాగం చేసి వాటి మంచి చెడులను చర్చించగల నేర్పు అస్సలు లేదు. నాకు తెలిసినదెల్లా కథల ప్రవాహంలో కొట్టుకుపోవడం మాత్రమే. కథలను ఇష్టపడడం మాత్రమే. కథలను చదువుతూ అవి పంచగల అనుభూతి సౌందర్యాన్ని ఆస్వాదించడం మాత్రమే. అవి పొందుపరచుకున్న అనుభవసారాన్ని సంగ్రహించడం మాత్రమే. మంచి కథను చదివినప్పుడు సమ్మోహితుడుని కావడం,  పేలవమైన…

  • పగటి వేషగాడు (కవిత)

    పగటి వేషగాడు (కవిత)

    నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద చీముగడ్డలా వివర్ణుడైన సూర్యుడు! తెల్లారుతుంది. అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు.. గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు! పలకరింపు ఒక కత్తి తునక.. ‘ఇలా ఎలా?’ ప్రతిసారీ ఒక పృచ్ఛ శలాక పొడుచుకుంటుంది..! జన్మాంతానికీ మానని గాయాన్ని కెలుకుతుంటుంది.. వేదన ప్రచ్ఛన్నంగా గుండె తెరచుకుంటుంది.. మీట నొక్కినట్టుగా.. నాలుగు మాటలు అప్పజెప్పేస్తాను! అశ్రురహిత భావరహిత ప్రేలాపనలాగా! ఏ పాతాళంలోకీ కూరుకుపోలేని అశక్తత.. ఆప్తులు వొస్తారు.. నన్ను ముంచి…

  • గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత

    గ్రంథాలయాలు.. విద్యార్థి జీవితంలో ఆవశ్యకత

    హైదరాబాదు మణికొండలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం (కార్యక్రమం ఏర్పాటుచేసిన ప్రభోదిత స్వచ్ఛంద సంస్థ సారథి శ్రీమతి జయభారతి గారికి, ప్రధానోపాధ్యాయులు నాగార్జున గారికి కృతజ్ఞతలు) గ్రంథాలయాలు అంటే  మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని పుస్తకాలను ఒక చోట చేరిస్తే దాన్ని లైబ్రరీ అంటాం. గ్రంథాలయం అంటే గ్రంథాలన్నీ ఉండే ఒక ప్రదేశం. కాబట్టి, గ్రంథాలయాల గురించి చెప్పడానికంటె ముందు.. పుస్తకం గురించి చెప్పాలి. పుస్తకాన్ని మనం కొద్దిగా బరువైన భాషలో గ్రంథం…