Warning: The magic method Gallery_Img::__wakeup() must have public visibility in /home/adarsini/sureshpillai.com/wp-content/plugins/gallery-images/gallery-images.php on line 97
WRITER – Page 2 – Suresh Pillai

WRITER

చున్నీ కింద.. (కవిత)

అవును, చున్నీ ఎరగని, నా చుడీదార్ కింద రొమ్ములే ఉన్నాయి!   ఆడది తారసపడగానే రతిక్రీడ తప్ప మరో ఆలోచన చేయలేని పశువుకు మాత్రమే కనిపించే రొమ్ములు! వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని చూడలేని గుడ్డి వెధవను మాత్రమే ఆకర్షించే  రొమ్ములు!! అంగస్తంభనలు ఉడిగిపోయిన వాడికి కూడా భావప్రాప్తిని అందించే రొమ్ములు!!   నావైన చైతన్యాలు.. ఊపిరాడనివ్వని కార్య భారాల మధ్య నా దృక్కులలో ఏ ప్రత్యేక విలువనూ సంతరించుకోక.. నా చేతలలో ఏ కొత్త గౌరవమూ పొందలేక.. నా …

చున్నీ కింద.. (కవిత) Read More »

సర్కిల్

సీన్ 1 ఏ:  ‘‘మామా ఏంది మందల. మొన్నే గద, ఫోన్జేసి ఊళ్లోవాళ్ల కతలన్నీ గంటసేపు జెప్పినావు. మళ్లీ జేశావేంది’’ ‘‘ఈపొద్దు పనిబడి చేసినాన్లేబ్బా’’ ‘‘ఏందిరా? మనోళ్లదేమైనా శుభకార్యమా’’ ‘‘మన చుక్కలనిడిగల్లు శీనుగాడు గుర్తుండాడా.. అయిస్కూల్లో దినామ్మూ మనకి వోళ్ల తోటలోంచి జాంపండ్లు తెచ్చిచ్చే వోడు.’’ ‘‘ఎందుకు గుర్తులేడ్రా నాయనా! అయి మామూలు జాంపండ్లా. రాయిబెట్టి పగలగొడితే, రంగుజూస్తే రోజా పూలు, రుచి జూస్తే చక్కెర గుండ్లు’’ ‘‘వోడికి నిండా జబ్బు చేసిందిరా.. రుయాకిబోతే మా వల్లగాదు …

సర్కిల్ Read More »

ఇఫ్తార్

‘గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నన్నేనా!? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. అవును నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో మొబైల్ తీస్తున్నాడు. ఎవరికైనా చెప్తాడా? ఏం చెప్తాడు? ఎవరినైనా పిలుస్తాడా? ఎందుకు పిలుస్తాడు? పారిపోనా? ఎందుకు? ఎక్కడకి? అదిగో, చూపు మరల్చినట్టుగా మరల్చి మళ్లీ చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో ఉంది! ఆ, ద్వేషం! ద్వేషమే అది. మనల్నందర్నీ కాపాడ్డానికి వాళ్ల దేవుడు మెళ్లో బిగబట్టుకున్నాడే, అది వాడి కళ్లలో, చూపుల్లో ప్రవహిస్తోంది.. విషం! విషంగా చూస్తున్నాడు. చూడ్డం …

ఇఫ్తార్ Read More »

టీనా

‘లిప్ కిస్’ అందులో అంత రొమాంటిక్ ఫీల్ ఉంటుందని నాకు తెలీదు. గాఢంగా హత్తుకున్నాడు. వంటిమీద, ఆ క్షణంలో, నూలుపోగైనా లేని నన్ను! అలాగని నాలుగు పెదవుల్నీ ఒక్కటిగా చేసేసి.. ఇహం మరచిపోయేంత అహంగా చుంబించనూ లేదు! నా పెదవిని తన పంటితో దొరకబుచ్చుకుని బలంగా అల్లరిపెట్టనూ లేదు. చెప్పాకదా.. ఆల్రెడీ నన్ను హత్తుకునే ఉన్నాడు. ఎలా..? ఓ నిండైన పూలగుత్తి చేజారుతోంటే పొదవుకున్నట్టుగా. కాసింత గట్టిగా పట్టుకుంటే పూలు ఎక్కడ నలిగిపోతాయో అని బెంగ పడేంతగా.. …

టీనా Read More »

‘మునివాక్యం’కు మక్కెన రామసుబ్బయ్య మనో వికాస సాహిత్య పురస్కారం

గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో సామాజికాంశాలపై రాసిన సంపాదకీయ కథనాల సంపుటి మునివాక్యం కు 2023 సంవత్సరానికి గాను మక్కెన రామసుబ్బయ్య ఉత్తమ మనోవికాస/ మనో వైజ్ఞానిక సాహిత్య పురస్కారం లభించింది. 2024 జులై 22న విశాఖ పౌరగ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మక్కెన శ్రీను గారికి కృతజ్ఞతలు.

వితండం మామ

నగరంలో పాడె కట్టేవాడికి చాలా  డిమాండు. ఏడెనిమిది అడుగులుండే నిలువు వెదురు బొంగులు రెండు,  వాటికి అడ్డలుగా వేయాల్సిన వెదురు బద్దలు డజనున్నర, పురికోసు దారాల కట్టలు రెండు, రెండు పిడికిళ్ల ఎండుగడ్డి, నాలుగైదు టెంకాయలు, పంచె, తువ్వాలు.. శవం మీద కప్పడానికి, బద్ది చేసుకోడానికి ఓ తెల్ల గుడ్డ, రెండుకుండలు, రెండు పూలమాలలు, కాసిని విడిపూలు, పూలరేకులు, బొరుగులు, బొగ్గులు, సాంబ్రాణి, అగరొత్తులు ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇవన్నీ కలిపి టోకుగా  ముప్పయ్యారు వేలవుతుందని లెక్కచెప్పాడు వాడు. …

వితండం మామ Read More »

‘పుత్రికా శత్రుః’కు కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు 2023

2023లో వెలువడిన నవలలకు నిర్వహించిన పోటీలో ‘పుత్రికా శః’ కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డును గెలుచుకుంది. చిత్తూరులో సాహితీ సేవ చేస్తున్న డాక్టర్ కె.రామలక్ష్మి గారికి కృతజ్ఞతలు. 2024 జూన్ 12న చిత్తూరులో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

ఆ చివరిసారి.. (కవిత)

1 ఎప్పుడైతే చివరిసారిగా నువ్వు నన్ను కలిశావో.. అధరాల మీదుగా అమృతాన్ని నాలోకి వొంపావు! దరహాసాల మీదుగా మైమరపును నాలో నింపావు! ఎప్పుడైతే చివరిసారిగా మనిద్దరం శయనించామో.. గుండెలపై ఆర్తిగా సేదతీర్చావు! దేహగంధాన్ని అలది నన్ను పరిమళ భరితుణ్ని చేశావు! 2 ఎప్పుడైతే చివరిసారిగా నువ్వూ నేనూ భేటీ చేశామో.. ఆలోచనల చైతన్యాన్ని నాలోకి ప్రవహింపజేశావు! ఎల్లల్లేని జ్ఞానాంబుధిలో నన్ను ఓలలాడించావు! ఎప్పుడైతే చివరిసారిగా నీతో నేను బాటను పంచుకున్నానో.. మాటలు రాజేసిన అగ్నితో నాలో చురుకును …

ఆ చివరిసారి.. (కవిత) Read More »

నైతిక కథా సంపద (ముందుమాట)

రోహిణి వంజారి కథాసంపుటి ‘నల్లసూరీడు’కు ముందుమాట ఒక రచయిత రాసే కథలోని బాధానందాలు, కష్టసుఖాలు, మానవీయ అనుభూతులు సమస్తం, ప్రతి సందర్భంలోనూ వారి స్వీయ అనుభవాలు అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ, కనీసం దృశ్యంగా, శ్రవణంగానైనా వాటిని ఎరిగి ఉండాలి. అంతే తప్ప.. ఊహల్లో ఒక అనుభూతికి రెసిపీ సిద్ధం చేసి, తద్భవమైన వంటకాన్ని పాఠకులకు వడ్డిస్తే అంతకు మించిన నేరం మరొకటి ఉండదు. కథలోని ప్రతి భావస్పందన రచయితకు తెలిసి ఉండాలి. ఊహ అత్యంత …

నైతిక కథా సంపద (ముందుమాట) Read More »