Your cart is currently empty!
Category: Photos
-

శీలా వీర్రాజు కథానికా పురస్కార ప్రదానం
గారడీవాడు కథా సంపుటికి శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 లభించింది. 2023లో వెలువడిన ఈ కథాసంపుటికి ఇది నాలుగో పురస్కారం. పురస్కార ప్రదానోత్సవం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జూన్ 7వ తేదీ శనివారం సాయంత్రం జరిగింది. ప్రముఖ కథారచయిత శ్రీ విహారి, తెలంగాణ సాంస్కృతికశాఖ డైరక్టరు శ్రీ మామిడి హరికృష్ణ, సినీ దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, రామ్‌కీ ఫౌండేషన్ సీఈఓ, ప్రముఖ రచయిత ఎమ్వీ రామిరెడ్డి, ప్రముఖ చిత్రకారులు శీలావీ చిత్రకళా పురస్కార గ్రహీత…
-

యద్భావం తద్భవతి పుస్తకావిష్కరణ సభలో..
తిరుపతికి చెందిన సీనియర్ రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజు రాసిన ఆధ్యాత్మిక కథల సంపుటి ‘యద్భావం తద్భవతి’ ఆవిష్కరణ తిరుపతిలో మే 11వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రామక్రిష్ణ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద, శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ రాణి సదాశివమూర్తి, సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్, శ్రీ గరికపాటి రమేష్ లతో కలిసి అతిథిగా పాల్గొనడం జరిగింది. [huge_it_gallery id=”3″]
-

‘మునివాక్యం’కు మక్కెన రామసుబ్బయ్య మనో వికాస సాహిత్య పురస్కారం
గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో సామాజికాంశాలపై రాసిన సంపాదకీయ కథనాల సంపుటి మునివాక్యం కు 2023 సంవత్సరానికి గాను మక్కెన రామసుబ్బయ్య ఉత్తమ మనోవికాస/ మనో వైజ్ఞానిక సాహిత్య పురస్కారం లభించింది. 2024 జులై 22న విశాఖ పౌరగ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మక్కెన శ్రీను గారికి కృతజ్ఞతలు. [huge_it_gallery id=”6″]
-

‘పుత్రికా శత్రుః’కు కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు 2023
2023లో వెలువడిన నవలలకు నిర్వహించిన పోటీలో ‘పుత్రికా శః’ కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డును గెలుచుకుంది. చిత్తూరులో సాహితీ సేవ చేస్తున్న డాక్టర్ కె.రామలక్ష్మి గారికి కృతజ్ఞతలు. 2024 జూన్ 12న చిత్తూరులో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. [huge_it_gallery id=”5″]

